కల్యాణ్ రామ్ సరసన రకుల్ ?
యన్.టి.ఆర్ కథానాయకుడు లో నందమూరి బాలకృష్ణ సరసన శ్రీదేవిగా రకుల్ ప్రీత్‌సింగ్ అతిథి పాత్రలో మెరిశారు. అంతకు ముందు చిన్న ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో లో నాయికగా నటించారు. ఇప్పుడు నందమూరి కుటుంబంలోని మరో హీరోతో జతకట్టనున్నారట. కల్యాణ్‌రామ్ తాజా చిత్రంలో ఆమెను నాయికా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. వేణు మల్లిడి దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తూ, నిర్మించనున్న చిత్రం తుగ్లక్. సోషియో ఫాంటసీ కథతో రూపొందనున్న ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేయనున్నారట. ఇందులో ఇద్దరు నాయికలకు చోటు ఉందని తెలుస్తోంది. మరో నాయికగా కేథరిన్ పేరు పరిశీలనలో ఉందట. మేలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.













