గజ తుపాను బాధితులకు సూపర్ స్టార్ భారీ విరాళం
గజ తుపాను బాధితుల సహాయార్థం సూపర్‌స్టార్ రజనీకాంత్ రూ.50 లక్షల సహాయం ప్రకటించారు. ఇప్పటికే సూర్య కుటుంబం, జీవీ ప్రకాశ్, విజయ్‌సేతుపతిలు విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. వీరితోపాటు పలువరు నటులు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో రూ.50 లక్షల విరాళాన్ని రజనీ ప్రకటించారు. ఈ మొత్తంలో సహాయకాలను అందజేయనున్నట్లు సంబంధిత వర్గాలు ప్రకటించాయి. ఇదిలా ఉండగా శివకార్తికేయన్ రూ.20 లక్షల విరాళం ప్రకటించారు. ఇందులో రూ.10 లక్షల నగదును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్లు తెలిపారు. మిగిలిన రూ.10 లక్షల సహాయక వస్తువుల రూపేనా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. లైకా నిర్మాణ సంస్థ రూ.1.01 కోట్లు విరాళం ప్రకటించింది.













