రహస్యం ట్రైలర్ ని విడుదల చేసిన రాజ్ కందుకూరి
సాగర్ శైలేష్ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం రహస్యం. శ్రీరితిక కథానాయిక. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు. మూడో ట్రైలర్‌ని నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగర్ శైలేష్ చాలా లఘు చిత్రాలు తీశాడు. ఒక సినిమాకి దర్శకత్వం చేయాలనే ఆయన కోరిక రహస్యంతో తీరింది. నాకు ట్రైలర్ బాగా నచ్చింది. కబీర్ రఫి సంగీతం కూడా చాలా బాగా ఉంది. రామసత్యనారాయణకు ఈ చిత్రంతో మరో విజయం లభిస్తుంది అన్నారు. ఇందులో రహస్యం ఎంత ఆక్తి రేకెత్తిస్తుందో, అది తెలిశాక కథ మరిన్ని మలుపులు తిరుగుతుంది అన్నారు రామసత్యనారాయణ ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సుధాకర్ అక్కినపల్లి.













