ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ కి 24 ఘంటలలో 6. 3 మిలియన్ల ట్వీట్స్
ప్రభాస్ 20వ చిత్రం ‘రాధేశ్యామ్’ అయితే ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ కొసం యావత్ ప్రపంచం లోని అభిమానులంతా ఎంతలా ఎదురు చూసారో చెప్పనక్కర్లేదు. నిన్న రిలీజ్ అయినా ఈ ఫస్ట్ లుక్ కి సోషల్ మీడియా లో అనూహ్యమైన స్పందన లభించింది. బాహుబలి1, బాహుబలి2 , సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న ప్రభాస్ ‘రాధేశ్యామ్’ తో సరి కొత్త రికార్డులను సొంతం చేసుకోనున్నాడు.
కేవలం 24 గంటల్లోనే 6.3 మిలియన్ల ట్వీట్స్ పెట్టడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రం ఎన్నో సూపర్‌హిట్స్ అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థలు గోపికృష్ణ మూవీస్ , యూవి క్రియెషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. జిల్ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం లో ప్రభాస్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తుంది. ఈ చిత్రాన్ని’రెబల్ స్టార్’ కృష్ణంరాజు సమర్పించగా, వంశి, ప్రమెద్, ప్రశీద లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే యూరప్ లాంటి విదేశాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకొని 70% టాకీ పార్ట్ ని పూర్తిచేసకుంది. మిగతా షూటింగ్ పార్ట్ ని ఈ కొవిడ్-19 ప్రభావం క్రైసిస్ ముగిసిన వెంటనే సెట్స్ మీదకి తీసుకువెలతారు. ఈ రోజు 24 గంటల్లోనే 6.3 మిలియన్ల ట్వీట్స్ పెట్టడంతో రెబల్ అభిమానులంతా సంబరాల్లో మునిగిపోయారు. అలానే ఈ సినిమా తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో విడుదల అవ్వనుంది.ఇనక్క మున్ముందు మరెన్నో రికార్డులను క్రియేట్ చేస్తుందో చూద్దాం.













