మరోసారి రాధాకృష్ణ నుంచి భారీ బడ్జెట్ సినిమా
చంద్రశేఖర్ యేలేటి శిష్యుడిగా జిల్ అనే యాక్షన్ మూవీతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు రాధాకృష్ణ. మొదటి సినిమాతోనే మంచి టాలెంట్ చూపించిన రాధాకృష్ణ, ఆ సినిమా ఓవర్ బడ్జెట్ వల్ల బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. మొదటి సినిమా కమర్షియల్ ఫలితాన్ని పట్టించుకోకుండా డైరెక్టర్ లోని టాలెంట్ ను గుర్తించిన ప్రభాస్ అతనికి ఛాన్స్ ఇచ్చాడు.
అందులో భాగంగానే రాధేశ్యామ్ తెరకెక్కింది. రాధేశ్యామ్ కోసం నిర్మాతలు ఏకంగా రూ.300 కోట్ల దాకా బడ్జెట్ పెట్టారు. కానీ సినిమాకు డివైడ్ టాక్ రావడంతో రిజల్ట్ తేడా కొట్టింది. రాధేశ్యామ్ కూడా ఓవర్ బడ్జెటే పెద్ద సమస్యగా మారింది. దీంతో ఈ సినిమా తర్వాత రాధాకృష్ణ తక్కువ బడ్జెట్ లో సినిమా చేస్తాడనుకున్నారంతా.
కానీ అతను మాత్రం మళ్లీ నిర్మాతలతో రిస్క్ చేస్తున్నట్లు సమాచారం. యువి క్రియేషన్స్ బ్యానర్లోనే ఈ సినిమా కూడా తెరకెక్కనుంది. హీరోగా గోపీచంద్ నటించనున్నాడు. అయితే ఈసారి వీరిద్దరి కాంబోలో రాబోయేది యుద్ధ నేపథ్యంలో జరిగే సినిమానట. ఈ చిత్రాన్ని దేశ విదేశాల్లోని భారీ లొకేషన్లలో చిత్రీకరించనున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నట్లు సమాచారం. అతి త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది.













