పుష్ప2 క్లైమాక్స్‌కు మతి పోవడం ఖాయమట
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా మంచి హిట్టే. పుష్ప1 అయితే వీరిద్దరికీ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. బన్నీకి స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ప్రమోషన్‌తో పాటూ, ఏకంగా నేషనల్ అవార్డ్ కూడా ఈ సినిమాతో అందుకున్నాడు.
ప్రస్తుతం వీరిద్దరూ పుష్ప2 కోసం తెగ కష్టపడుతున్నారు. పుష్ప1ను మించేలా ఈ సీక్వెల్ ను తీయాలని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దీన్ని తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు పుష్ప2లో చాలా సర్ప్రైజ్ లు ఉంటాయని కూడా తెలుస్తోంది. క్లైమాక్స్ లో సుకుమార్ ఇచ్చే ట్విస్ట్ కు మతిపోతుందని టాక్. ముందుగా పుష్ప2 స్టోరీని ఈ సినిమాతో ముగించాలనుకున్నప్పటికీ దీనికి మరో భాగం ఉంటే బాగుంటుందనే ఆలోచనలో సుకుమార్ ఉన్నాడట.
పుష్ప2లో పుష్ప రాజ్ క్రేజ్, ఆ యూఫోరియా నెక్ట్స్ లెవెల్లో ఉంటుందని, పుష్ప1 రికార్డులను ఈ సినిమా తిరగరాస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో బలంగా చెప్తున్నారు. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుందని వార్తలొస్తున్నాయి. ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది. పుష్ప2 వచ్చే ఏడాది ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.













