పూరితో రామ్
దాదాపు అగ్ర కథానాయకులందరితోనూ సినిమాలు చేశారు పూరి జగన్నాథ్. యువ కథానాయకుల కోసమూ కథలు రాసేశారు. అయితే రామ్‌తో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇప్పుడు అందుకు మూహూర్తం సిద్ధమవుతోంది. రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. పూరినే నిర్మాత. జనవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. మేలో విడుదల చేస్తారు. తన సినిమాల్లో కథానాయకుడిని కొత్తగా ఆవిష్కరించడం పూరికి అలవాటు. అలాంటి కథలోనే రామ్ కనిపిస్తారు. తన గెటప్ కొత్తగా ఉండబోతోంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది.













