యుద్ధం… అపుడే ముగియదు : పూరి
కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. కరోనా బాధితుల సంఖ్య లక్షల్లోకి చేరింది. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వ్యాది గ్రస్థుల సంఖ్య లక్షదాటిపోవటం జరిగింది. ఈ పరిణామాలపై దర్శకుడు పూరి జగన్నాధ్ స్పందించారు. ఇప్పట్లో సాధారణ పరిస్థితులు ఏర్పడే సూచనలు లేవని చెప్పారు. అలాగే కరోనాపై యుద్ధం అపుడే ముగియదని అన్నారు. లాక్డౌన్ మే లేదా జూన్ వరకు పొడిగించే అవకాశం ఉందని అన్నారు. మిగతా దేశాల్లో ఉన్న పరిస్థితులతో పోల్చుకుంటే మనం బెటర్ అన్నారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనటానికి సిద్దంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.













