పీకే28 రిలీజ్ కూడా అదే రోజునా..?
ఒక్కో డైరక్టర్ కి ఒక్కో మేకింగ్ స్టైల్ ఉంటుంది. ఇందులో టాలీవుడ్ డైరక్టర్ హరీష్ శంకర్ మేకింగ్ స్టైల్ ఒక రకం. మాస్ మరియు కమర్షియల్ సినిమాలు తీయడంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పదేళ్ల క్రితం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ డైరక్షన్ లో తీసిన గబ్బర్ సింగ్ ఏ రేంజ్ విజయాన్నందుకుందో తెలియంది కాదు. ఆ సినిమా తర్వాత హరీష్ స్టార్ డైరక్టరయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే హరీష్ శంకర్ కెరీర్ బిఫోర్ గబ్బర్ సింగ్, ఆఫ్టర్ గబ్బర్ సింగ్ అన్నమాట. కానీ ఆ సినిమా తర్వాత మాత్రం హరీష్ అంతటి విజయాన్ని అందుకుంది లేదు. ఇటీవల గద్దలకొండ గణేష్ తో ఆఖరి హిట్ అందుకున్న హరీష్ శంకర్ ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ తో మరోసారి గబ్బర్ సింగ్ కు సీక్వెల్ గబ్బర్ సింగ్2 చేస్తున్న విషయం తెలిసిందే.
పవన్ కోసం మంచి మాస్ ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్ రెడీ చేసిన హరీష్.. ఇప్పుడు మరోసారి పవన్ తో సినిమా చేసి హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. వీరి కాంబోలో సినిమా రాబోతుందంటేనే ఫ్యాన్స్ లో అంచనాలు ఒక రేంజ్ లో పెరిగిపోయాయి. ఫ్యాన్స్ అంచనాలు అందుకునే రేంజ్ లోనే హరీష్ ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాడట. గబ్బర్ సింగ్ మూవీ 2012 సమ్మర్ లో రిలీజై వసూళ్ల వర్షం కురిపించింది.
ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. మళ్లీ పదేళ్లకు సమ్మర్ లో వీరి కాంబోతో పలకరించేందుకు రంగం సిద్ధం అవుతుందట. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను రీమేక్ కథతో కాకుండా సొంత కథతో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు హరీష్. ఎంటర్టైన్మెంట్ తో పాటూ మెసేజ్ కూడా ఉండేలా ఈ సినిమా ఉండనుందని టాక్. జూన్ లేదా జులై లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని, 2022 మే 11న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట సినిమా యూనిట్.













