ఆదర్శ కుటుంబం వాయిదాపై నిర్మాత క్లారిటీ
విక్టరీ వెంకటేష్(venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(trivikram) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం(Aadarsha kutumbam) సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు అనూహ్యమైన అప్డేట్ వచ్చింది. అక్టోబర్ 9న థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు నిర్మాత ఎస్. నాగవంశీ(S nagavamsi) ప్రకటించారు. ఆఖరి దశలో ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కు మరింత టైమ్ అవసరం కావడంతో ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలిపారు. రిలీజ్‌కు కొద్దిరోజుల ముందు ఈ మార్పు రావడంతో ఫ్యాన్స్ కు, ఆడియన్స్ కు ఆయన క్షమాపణలు చెప్పారు.
అయితే వాయిదా పడటంతో సినిమా ప్రమోషన్స్ విషయంలోనూ కొత్త ఊపును తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే రెండు వారాల్లో రెండు సాంగ్స్ తో పాటు ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు నాగవంశీ వెల్లడించారు. ప్రస్తుతం వెంకటేష్ విదేశాల్లో ఉండటంతో ఆయన హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాతే కొత్త రిలీజ్ డేట్‌పై ఫైనల్ డెసిషన్ తీసుకోనున్నామని, నిర్మాత సురేష్‌బాబు(Suresh babu)తో కూడా రిలీజ్ డేట్ విషయంలో డిస్కస్ చేసిన తర్వాతే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని వంశీ చెప్పారు. అక్టోబర్ 30న సినిమా రిలీజవుతుందనే ప్రచారానికి కూడా ఇప్పటివరకు ఎలాంటి కన్ఫర్మేషన్ లేదని ఆయన స్పష్టం చేశారు.
త్రివిక్రమ్‌తో వెంకటేష్ తొలిసారి కలిసి పనిచేస్తున్న సినిమా కావడంతో ఆదర్శ కుటుంబంపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే తొందరపడి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కంటే, అవుట్‌పుట్ విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే ఆలస్యం చేస్తున్నట్లు నిర్మాత చెప్పడం ఆసక్తికరంగా మారింది. శ్రీనిధి శెట్టి(Sreenidhi shetty) హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్(thaman) సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్(haarika hassine creations) నిర్మిస్తున్న ఈ సినిమాకు కొత్త రిలీజ్ డేట్ పై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.








