ది ప్యారడైజ్ ఈవెంట్ లో పవన్ కు ఎలివేషన్లు
సినిమా ఈవెంట్లలో దిల్ రాజు(dil raju) స్పీచ్ అంటే స్టార్ హీరోల ప్రస్తావన రావడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్(pawan kalyan)పై ఆయనకున్న అభిమానం పలుమార్లు బయటపడింది. తాజాగా ది ప్యారడైజ్(the paradise) ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ అదే జరిగింది. వకీల్ సాబ్(Vakeel saab) రిలీజ్ టైమ్ లో కోవిడ్ కారణంగా ఎదురైన ఇబ్బందులను గుర్తుచేసుకున్న దిల్ రాజు.. తనకు రావాల్సిన రూ.5 కోట్ల పారితోషికాన్ని తీసుకోకుండా పవన్ కల్యాణ్ సహకరించారని చెప్పుకొచ్చారు. పవన్ పేరు వినిపించగానే ఈవెంట్ ప్రాంగణం ఫ్యాన్స్ అరుపులతో మార్మోగింది.
అయితే ఈ ప్రస్తావనతో ఆగకుండా ది ప్యారడైజ్ నిర్మాత సుధాకర్ చెరుకూరి(Sudhakar cherukuri)పై కూడా దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాకు వైజాగ్ థియేట్రికల్ రైట్స్ ను దిల్ రాజు సొంతం చేసుకున్నారు. తాను ఇచ్చిన ఆఫర్ కంటే కూడా కొంత తక్కువ మొత్తానికే రైట్స్ ఇచ్చేందుకు నిర్మాత ముందుకొచ్చారని ఆయన వెల్లడించారు. సినిమా మీద మంచి హైప్ ఉన్న టైమ్ లో నిర్మాతలు మామూలుగా బిజినెస్ పరంగా ఎక్కువ రాబడిని ఆశిస్తారు. కానీ ఇక్కడ సుధాకర్ తీసుకున్న డెసిషన్ ను దిల్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.
ఇదే సందర్భంగా ది ప్యారడైజ్ నైజాం ఏరియాలో రూ.50 కోట్ల షేర్ సాధించే అవకాశముందని దిల్ రాజు ధీమా వ్యక్తం చేశారు. నాని(nani) కెరీర్లో ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు సృష్టించింది. వైజాగ్ రైట్స్ ఎంత మొత్తానికి అమ్ముడయ్యాయనే అఫీషియల్ వివరాలు బయటకు రాకపోయినా, అక్కడి బిజినెస్ కూడా నాని గత సినిమాలతో పోలిస్తే గణనీయంగా ఉండొచ్చనే అంచనాలున్నాయి. ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందనేది ఆసక్తికరంగా మారింది.








