ఈరోజే దిల్‌రాజు వివాహం
‘దిల్’ చిత్రంతో నిర్మాత కెరీర్ ప్రారంభించి ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో దిల్‌రాజుగా అందరి చేత పిలవబడుతున్నారు రాజు. ఆ సినిమా తర్వాత టాప్ హీరోలతో ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలు నిర్మించి టాప్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు.
నిర్మాతగా ఆయన కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న సమయంలో ఆయన కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి అనిత అనారోగ్య కారణాల వల్ల మృతి చెందారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు దిల్‌రాజు మళ్ళీ పెళ్ళి చేసుకోబోతున్నారన్న వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు అదే వార్త నిజం కాబోతోంది. ఈరోజు అంటే మే 10 రాత్రి 11 గంటకు దిల్‌రాజు వివాహం జరగబోతోంది. నిజామాబాద్‌లో దిల్‌రాజు కుటుంబ సభ్యులచే నిర్మించ బడిన శ్రీవేంకశ్వర ఆలయంలో దిల్‌రాజు వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో జరగనుంది.













