ఫౌజీ రిలీజ్ పై నిర్మాత క్లారిటీ.. ఎప్పుడొచ్చినా గొప్ప సినిమా అవుతుంది
డిసెంబరు 3 డేట్ నుంచి ఫౌజీ(fauzi) తప్పుకున్నట్టే.. ప్రభాస్(prabhas) ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విషయంలో గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న వాయిదా వార్తలకు ఇప్పుడు నిర్మాతల మాటతో క్లారిటీ వచ్చింది. ది ప్యారడైజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్(the paradise pre release event)కు హాజరైన మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) నిర్మాత రవి(ravi) మాట్లాడుతూ ఫౌజీ రిలీజ్ లేట్ అవుతుందని తెలిపారు. అయితే సినిమా విషయంలో మాత్రం ఎలాంటి నిరాశ అవసరం లేదని, ఆడియన్స్ తప్పకుండా ఒక గొప్ప సినిమాను చూస్తారని హామీ ఇచ్చారు. దీంతో డిసెంబరు 3న ఫౌజీ థియేటర్లలోకి రావడం లేదన్న విషయం ఖరారైంది. కొత్త రిలీజ్ డేట్‌ను మాత్రం నిర్మాత వెల్లడించలేదు.
ప్రస్తుతం ఫౌజీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రభాస్(prabhas)పై కీలకమైన యాక్షన్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను దృష్టిలో పెట్టుకునే రిలీజ్ ను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. జనవరి 26న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలా, లేదంటే ఉగాది సీజన్‌ను టార్గెట్ చేయాలా అన్న దానిపై చిత్రబృందం ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే అఫీషియల్ గా కొత్త డేట్ అనౌన్స్ చేసేవరకు ఈ రెండు డేట్స్ ఏది ఫిక్స్ అవుతుందన్నది క్లారిటీ లేదు.
ఇక ఫౌజీ డేట్ ఖాళీ కావడంతో డిసెంబరు మొదటి వారంలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఇతర సినిమాలకు ఇప్పుడు మంచి అవకాశం దక్కినట్టే. విశ్వక్సేన్(Viswaksen) నటిస్తున్న లెగసీ(legacy) ఇప్పటికే డిసెంబరు 4న రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. దీంతో ఆ డేట్‌కు పోటీ పెద్దగా లేకుండా పోయింది. మరోవైపు వృషకర్మ(Vrushakarma) కూడా డిసెంబరు 3న రిలీజయ్యే అవకాశాలపై ప్రచారం సాగుతోంది. ఫౌజీ తప్పుకోవడంతో ఆ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించే పరిస్థితి కనిపిస్తోంది. మరికొన్ని సినిమాలు సైతం ఇదే వీకెండ్‌ను టార్గెట్ చేసే అవకాశాలుండటంతో డిసెంబరు మొదటి వారం బాక్సాఫీస్ రేస్ ఆసక్తికరంగా మారుతోంది.








