ప్రతిరోజు పండగే ఫస్ట్ లుక్
సాయి తేజ్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ప్రతిరోజూ పండగే. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. సుప్రీమ్ లాంటి సూపర్‌హిట్ సినిమా తర్వాత సాయితేజ్ సరసన రాశీఖన్నా నటిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం నానక్‌రామ్ గూడ, రామానాయుడు స్టూడియోలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. పోస్టర్లో తేజ్ స్టైలిష్‌గా కనిపించడమే కాకుండా సత్యరాజ్, తేజ్ మధ్య మంచి అనుబంధం, భావోద్వేగం ఉందని తెలుస్తుంది. పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రమిది. మారుతి చిత్రాల్లో సహజంగా ఉండే వినోదం కంటే రెండు రెట్లు ఎక్కువ పంచుతుందని అని నిర్మాత తెలిపారు. విజయకుమార్, రావు రమేశ్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జయకుమార్, సంగీతం :తమన్.













