ప్రభాస్ అభిమామానులకు సర్ప్రైజ్
సాహో సినిమా అపజయం తర్వాత ప్రభాస్ ఏ సినిమా చేస్తారన్న దానిపై ఇప్పటి వరకూ సృష్టత లేదు. కానీ ఆయన పుట్టిన రోజు ఈనెల 23న. బర్త్ డే కానుకగా తన అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. అదే జిల్ డైరెక్టర్ రాధాకృష్ణ కాంబినేషన్లో రూపొందనున్న సినిమాకు సంబంధించినది. ఆ చిత్రంలో ప్రభాస్ లుక్ ఎలా ఉండబతుందో ఈ నెల 22న తెలియనుంది. ఆ రోజు కొత్త లుక్‌ను విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఇది ప్రభాస్ 20వ సినిమా. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కనుంది. పూజా హెగ్డే కథానాయిక. సాహో చిత్రం అపజయం తర్వాత ఈ సినిమా స్క్రిప్ట్‌లోనూ, బడ్టెట్లోనూ మార్పులు చేశారు. ఇది తక్కువ బడ్జెట్లోనే తెరకెక్కించనున్నారు. దీని కోసం యూరప్‌లో ప్రత్యేకంగా సెట్ వేస్తున్నారు. ఎక్కువ చిత్రీకరణ అక్కడే జరపనున్నారు. ఓ ప్రేమ కథా చిత్రంగా రూపొందించబోతున్నారు.













