బాలకృష్ణ- ప్రభాస్ లతో ఓ గ్రాండ్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్న ప్రొడ్యూసర్ అల్లు అరవింద్
టాప్ స్టార్స్ ని ఒక్కొక్కరుగా ఆన్ లైన్ వేదికలపైకి రప్పిస్తున్నారు ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. సినిమాల్లోనే కాదు ఓటీటీ వేదికపై కూడా తన మార్క్ చూపించాలని ఫిక్సయిన బడా ఈ క్రమంలోనే బాలకృష్ణ- ప్రభాస్ లతో ఓ గ్రాండ్ ఎపిసోడ్ ప్లాన్ చేశారట. సింగిల్ స్క్రీన్‌పై ఇద్దరు బడా స్టార్స్ కనిపిస్తే ఆ కిక్కే వేరు. అయితే అందులోనూ రెండు తరాల టాప్ హీరోస్ ఒకే కెమెరా ముందుకొస్తే ఆ సంచలనాలు ఊహించగలమా. సరిగ్గా అదే స్కెచ్ రెడీ చేస్తోందట ఆహా టీమ్. సినిమాల్లోనే కాదు ఓటీటీ వేదికపై కూడా తన మార్క్ చూపించాలని ఫిక్సయిన బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సినీ తారలను ఒక్కొక్కరుగా ఆన్ లైన్ వేదికలపైకి రప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్- బాలకృష్ణ కాంబో సెట్ చేస్తూ పక్కా స్కెచ్చేశారని సమాచారం. ఓటీటీ సంస్థ ఆహా వేదికపై బాలకృష్ణ హోస్ట్‌గా అదిరిపోయే టాక్ షో నడుస్తున్న సంగతి తెలిసిందే.
అన్‌స్టాపబుల్ పేరుతో రన్ చేస్తున్న ఈ షోకు భారీ రెస్పాన్స్ వస్తోంది.” అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవరు ఆపుతారో చూద్దాం” అని గర్జిస్తూ నందమూరి నటసింహం తనదైన బాటలో దూసుకెళ్తున్నారు. బాలయ్య చలాకీతనానికి తోడు గెస్టుల ముచ్చట్లతో ప్రేక్షకులు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. అలా అన్‌స్టాపబుల్ తొలి ఎపిసోడ్‌ను మంచు మోహన్ బాబు అండ్ ఫ్యామిలీపై షూట్ చేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆహా టీమ్.. ఆ తర్వాత నాచురల్ స్టార్ నానితో మ్యాజిక్ చేసింది. ఇక రీసెంట్గా హాస్య దిగ్గజం బ్రహ్మానందంతో కితకితలు పెట్టిస్తూ జోష్ నింపారు. అయితే ఈ సారి మాత్రం షోకి మరింత గ్రాండ్ లుక్ వచ్చేలా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ని గెస్టుగా తీసుకొస్తున్నారట. ఇటీవల పలు సినిమాల ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ప్రభాస్.. ఆహా వేదికపైకి వచ్చి బాలయ్య బాబుతో సందడి చేయబోతున్నారట. ఇప్పటికే ఇందుకు సంబంధించిన డీల్ సెట్టయిందని, త్వరలోనే ఈ ఎపిసోడ్‌పై ఆహా టీమ్ నుంచి ఫుల్ క్లారిటీ రానుందని టాక్.













