టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్‌కి షాక్ ఇచ్చిన ప్రభాస్ `ఆదిపురుష్`?
సినిమా పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరు ఏ కాంబినేషన్‌తో సినిమా చేస్తారో ఎవరూ చెప్పలేరు. కొన్నిసార్లు తాము చేద్దామనుకున్న ప్రాజెక్ట్ వేరే వాళ్ళు అనౌన్స్ చెయ్యడం వల్ల అప్పటివరకు ఆ ప్రాజెక్ట్‌పై చేసిన వర్క్ అంతా వృధా అయిపోయింది. ఇప్పుడు అలాంటి పరిస్థితే టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. గత సంవత్సరం `రామాయణ్` పేరుతో ఓ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించబోతున్నామని అల్లు అరవింద్ ప్రకటించాడు. నితిష్ తివారి, రవి ఉద్యవార్ దర్శకత్వంలో అల్లు అరవింద్, నమిత్ మల్హోత్రా, మధు మంతెన ఈ చిత్రాన్ని 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతోంది. ఇదిలా ఉండగా ఒక ఫైన్ మార్నింగ్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో `ఆదిపురుష్` సినిమాను సడన్‌గా ఎనౌన్స్ చేశారు. రామాయణం నేపథ్యంలోనే ఈ సినిమా కూడా రూపొందనుంది. దీంతో అల్లు అరవింద్ బృందానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. రెండు సినిమాలూ రామాయణం నేపథ్యంలో ఉన్నప్పటికీ అందులో ఏ కోణాన్ని ఎవరు ఎంపిక చేసుకున్నారనే విషయం తెలియదు.
`ఆదిపురుష్` చిత్రంలో ప్రభాస్ రాముడుగా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడుగా కనిపించబోతున్నాడు. ఈ రెండు సినిమాల్లో ఏది సెట్స్‌పైకి వస్తుందనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ప్రభాస్‌కి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ మూడు సినిమాలు కమిట్ అయ్యాడు. అందులో మొదటిది రాధేశ్యామ్ షూటింగ్ దశలో ఉంది. దాని తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మించే సినిమా ఉంది. మూడోది ఆదిపురుష్. అయితే నాగ్ అశ్విన్ సినిమా కంటే ముందే ఆదిపురుష్ సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం. ఈ మూడు సినిమాలూ ప్యాన్ ఇండియా మూవీస్‌గా తెరకెక్కనున్నాయి. వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్‌ను ఈ సినిమాల కోసం కేటాయిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే బిజినెస్ కూడా జరిగే అవకాశం ఉంది. మరి ప్రభాస్ ఈ మూడు సినిమాలతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో.. ఎన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.













