సమంత తరువాత ఆ క్రెడిట్ పూజాదే
త్రివిక్రమ్ దర్శకత్వంలో రెండు సినిమాలు (జల్సా-జలాయి) చేసిన ఘనత ఇలియానాది కాగా.. ఆయన దర్శక్వంలో ఏకంగా మూడు సినిమాలు చేసిన క్రెడిట్ నమంతాది. అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ సినిమాలు చేసిందామే. ఇప్పుడు తాజాగా ఆ రికార్డును పూజా హేగ్డే సమంచేయనుంది. భవిష్యత్తులో ఆమె సొంతంగా రికార్డు నెలకొల్పినా ఆశ్చర్యం లేదు. అరవింద సమేత వీర రాఘవ చిత్రం కోసం తొలిసారి త్రివిక్రమ్‌తో జతకట్టిన పూజా.. ఆ తరువాత అల వైకుంఠ పురములోనూ నటించి, అరవింద సమేత హిట్ అనిపించుకోగా.. అల వైకుంఠపురములో మాత్రం ఆసాధారణ విజయం సొంతం చేసుకుంది. తాజాగా వినబడుతున్న సమాచారం ప్రకారం…ఎన్టీఆర్‌తో రెండోసారి త్రివిక్రమ్ తెరకెక్కించనున్న చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డేను తీసుకోవడం దాదాపుగా ఖరారైపోయిందని చెబుతున్నారు.













