హీరోయిన్ పూజా హెగ్డే కి ‘ఆచార్య’ హ్యాట్ట్రిక్ చిత్రమైందిగా?
మొన్న అనుకున్నదే నిజమైంది, హీరోయిన్ పూజా హెగ్డే హ్యాట్ట్రిక్ ప్లాప్స్ తన అకౌంట్ లో వేసుకుంది. దువ్వాడ జగన్నాథం, అరవింద సమేత, మహర్షి, గద్దల కొండ గణేష్, అల వైంకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.. ఇవన్నీ హీరోయిన్ పూజా హెగ్డే కెరియర్లో హిట్ సినిమాలు కాగా.. ఒకలైలా కోసం, ముకుందా, రాధే శ్యామ్, బీస్ట్ చిత్రాలు ఫ్లాప్ ల లిస్టులో . ‘ఆచార్య’ కూడా చేరింది హీరోయిన్ పూజా హెగ్డే. ఒకప్పుడు ‘బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా’ అంటూ ఓ ఊపు ఊపిన పూజాని తెలుగు ఆడియన్స్ పెద్దగా పట్టించుకోవట్లేదు. దీనికి కారణం వరుస డిజాస్టర్లు. ఒకప్పుడు వరుస హిట్లతో మంచి ఊపుమీద కనిపించిన పూజా హెగ్డే.. కేవలం గ్లామర్ డాల్‌గా మిగిలిపోవడంతో.. పెర్ఫామెన్స్ స్కోప్ ఉన్న పాత్రల్ని పక్కనపెట్టేసి.. కమర్షియల్ పంతాలోనే వెళ్లిపోతుంది.
తెలుగులో ఇన్ని సినిమాలు చేసి.. పెద్ద పెద్ద హిట్లు కొట్టినా సరే.. ఏం చూపించిందిరా అనే డైలాగ్‌లు తప్పితే ఏం నటించిందిరా? అన్న ప్రశంసలు అయితే అందుకోలేకపోయింది. పోనీ ‘ఆచార్య’లో అయినా స్కోప్ ఉన్న రోల్ లభిస్తుందని అనుకుంటే ప్రాముఖ్యత లేని పాత్ర చేసింది. అందులోనూ స్టార్ ఇమేజ్ ఉన్న ఇద్దరు తండ్రీకొడుకుల్ని బ్యాలెన్స్ చేయడం అంటే చిన్న విషయం కాదు.. ఈ ప్రాసెస్‌లో గ్లామర్ రోల్స్ చేసే పూజా హెగ్డేకి.. పెర్ఫామెన్స్ స్కోప్ ఉన్న రోల్ లభిస్తుందని ఆశించడం అత్యాశే అవుతుంది. రాధేశ్యామ్, బీస్ట్ ఈ రెండు చిత్రాలు ఫ్లాప్ కావడంతో పూజా హెగ్డేకి అప్పుడే ఐరన్ లెగ్ అనేస్తున్నారు. రెండు బిగ్ ప్రాజెక్ట్ చిత్రాలు వరుస డిజాస్టర్ అంటే బుట్టబొమ్మకి పెద్ద దెబ్బే. ఇప్పుడు ‘ఆచార్య’ పలితం బట్టి చూస్తే చిత్రంతో పూజా హెగ్డే హీరోయిన్ కావడం ఐరన్ లెగ్ అన్న మాట నిజమైంది.













