‘పోలీస్ పటాస్’ ట్రైలర్‌ను విడుదల చేసిన సి.కళ్యాణ్
భీమవరం టాకీస్ 97వ సినిమా పోలీస్ పటాస్. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా ప్రమోషనల్ ట్రైలర్‌ను నిర్మాత సి.కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ నా శిష్యుడు రామసత్యనారాయణ చేస్తున్న 97వ సినిమా ఇది. అతను 100 సినిమాలను చేయబోతున్నాడు. అతను నిర్మించే అన్ని సినిమాలు విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ నేను సినిమాలు తీయడం నేర్చుకున్నది సి.కళ్యాణ్ దగ్గరే. ఇక పోలీస్ పటాస్ సినిమాలో అయేషా చక్కగా నటించింది. ఈ సినిమా తరువాత ఆమెకు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడుతుంది. విజయశాంతి తరువాత అంత గొప్ప పేరు సంపాదించుకుంటుంది అని తెలిపారు. మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన అయేషా ఈ సినిమాలో నటించడం విశేషం. రామసత్యనారాయణ మంచి చిత్రాలు నిర్మిస్తూ చిన్న నిర్మాతలకు రోల్‌మోడల్ అయ్యారు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాయి వెంకట్, అయేషా, సుధీష్, రవికాలే, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.













