రవితేజ సరసన పాయల్ ?
ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ తన తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత ఆమెకు కొన్ని మంచి అవకాశాలు వచ్చాయి. అయితే ఆచితూచి సినిమాలను ఎంచుకుంటోంది ఈ బ్యూటీ. ఇప్పుడు పాయల్ ఓ కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిసింది. వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రవితేజ నటించనున్న ఓ చిత్రంలో ఈ బ్యూటీ ఒక హీరోయిన్గా ఎంపికైంది. ముగ్గురు హీరోయిన్లకు ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రంలో నన్ను దోచుకుందువటే ఫేమ్ సభా నటేష్‌ను మరొక హీరోయిన్గా ఎంపిక చేశారు. ఈ చిత్రం డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. రవితేజ డ్యూయల్ రోల్లో నటించనున్న ఈ చిత్రంలో సునీల్ ఓ ముఖ్య పాత్రలో నటించనున్నారు.













