పవర్ స్టార్ తో గోల్డెన్ లెగ్స్ హీరోయిన్ పూజ హెగ్డే
బాలీవుడ్ లో ఐరన్ లెగ్ అనిపించినా టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా ఫుల్ బిజీ హీరోయిన్ పూజ హెగ్డే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత క్రిష్, హరీష్ శంకర్ ఇద్దరి డైరక్షన్ లో సినిమాలు ఫిక్స్ చేసుకున్నారు. క్రిష్ డైరక్షన్ లో మూవీ పిరియాడికల్ కథతో రాబోతుంది. ఈ సినిమాకు విరూపాక్ష, గజదొంగ, బందిపోటు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక రెండు సినిమాల తర్వాత పవర్ స్టార్ గబ్బర్ సింగ్ డైరక్టర్ హరీష్ శంకర్ తో సినిమా ఉంటుందని తెలుస్తుంది.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే హరీష్ శంకర్ స్టోరీని రెడీ చేసాడు కథ అద్భుతంగా వచ్చందని పవర్ స్టార్ ఫాన్స్ ని ఊరించడం జరుగుతుంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ మరోసారి కాలర్ ఎగరేసేలా ఈ సినిమా ఉంటుందని.. గబ్బర్ సింగ్ కాదు దాన్ని మిచ్చిన సినిమా తీస్తానని అంటున్నాడు హరీష్ శంకర్. ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో కనిపిస్తారట. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుందని వార్తలు రాగా ఇప్పుడు ఆమె ప్లేస్ లో మోస్ట్ బిజీ హీరోయిన్ పూజా హెగ్దే ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తుంది. టాలీవుడ్ స్టార్స్ సినిమాలతో పూజా హెగ్దే దుమ్ముదులిపేస్తుంది. టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన పూజా హెగ్దే ఆమె కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారంటే నమ్మాలి. అమ్మడు సినిమాలో ఉంటే గ్లామర్ షో స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుంది. కాబట్టి పూజా హెగ్దేనే స్టార్స్ కూడా కావాలని అంటున్నారు. మరి పవర్ స్టార్ సినిమాతో పూజా క్రేజ్ డబుల్ ట్రిపుల్ అవుతుందని చెప్పొచ్చు.













