ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం
2019 పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పద్మ అవార్డులను ప్రదానం చేశారు. మొత్తం 112 మంది విజేతల్లో ఇవాళ 47 మందికి రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తదితరులు హాజరయ్యారు. మిగిలినవారికి ఈ నెల 16న జరిగే తదుపరి కార్యక్రమంలో పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.
అవార్డులు అందుకున్న ప్రముఖులు : నటుడు మోహన్ లాల్ (పద్మభూషణ్), సర్దార్ సుఖ్‌దేవ్ సింగ్ దిల్సా(పద్మభూషణ్), హకుందేవ్ నారాయణ్ యాదవ్(పద్మభూషణ్), ప్రముఖ జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్ (మరణానంతరం) పద్మభూషణ్ (ఈ అవార్డును ఆయన భార్య భారతి నయ్యర్ అందుకున్నారు), రెజ్లర్ భజరంగ్ పునియా (పద్మశ్రీ), చెస్ గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక (పద్మశ్రీ), టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు శరత్ కమల్ (పద్మశ్రీ), విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సుబ్రమణ్యం జయశంకర్ (పద్మశ్రీ), నటుడు ప్రభుదేవా (పద్మశ్రీ), సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ (పద్మశ్రీ), కబడ్డీ ఆటగాడు అజయ్ ఠాకూర్ (పద్మశ్రీ).













