ఎన్టీఆర్ మూవీ #30 టైటిల్ అదిరిందిగా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మార్చ్ వరకు కంప్లీట్ కాబోతోందని సమాచారం. అప్పుడే ఎన్టీఆర్ 30వ సినిమాకి సన్నాహాలు మొదలయ్యాయి. దాదాపు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ కంప్లీట్ అయిందని సమాచారం. మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించబోతున్నారు. ఆర్ ఆర్ ఆర్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియన్ స్టార్ గా క్రేజ్ దక్కబోతుండగా ఆర్ ఆర్ ఆర్ సినిమా రేంజ్ లోనే ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా కూడా భారీ పాన్ ఇండియన్ సినిమాగా ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇంతక ముందు అరవింద సమేత వీర రాఘవ సినిమా మంచి కమర్షియల్ హిట్ అందుకున్నారు. దాంతో ఇప్పుడు తెరకెక్కబోతున్న లేటెస్ట్ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కబోతున్న సినిమా కి సాలీడ్ టైటిల్ ని అనుకుంటున్నట్టు సమాచారం. నిన్నా మొన్నటి వరకు ఈ సినిమాకి ‘అయినను పోయిరావలె హస్తినకు….’ అన్న టైటిల్ ప్రచారం లో ఉంది. కాగా ఇప్పుడు ఈ సినిమాకి ‘చౌడప్ప నాయుడు’ అన్న టైటిల్ ని పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. చౌడప్ప నాయుడు ఎన్టీఆర్ కి పర్ఫెక్ట్ గా సూటవుతుందని చాలా పవర్ఫుల్ గా ఉందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఇక దాదాపు ఈ టైటిల్ నే మేకర్స్ ఫైనల్ చేసినట్టు త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.













