నివేథా థామస్ కు బంపర్ ఆఫర్
తెలుగులో అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రల్ని ఎంచుకుంటూ కథానాయికగా ప్రతిభను చాటుకుంటోంది నివేథా థామస్. తొలి సినిమా నుంచి వైవిధ్యతకు పెద్దపీట వేస్తూ సినిమాలు చేస్తున్న ఆమె తాజాగా తెలుగులో బంపర్ ఆఫర్‌ను సొంతం చేసుకున్నట్లు సమచారం. హీరో అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లో ఎర్రచందనం అక్రమరవాణా ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. రష్మికమందన్న ప్రధాన నాయికగా నటిస్తోంది. కాగా ఈ సినిమాలో మరో నాయిక నివేథా థామస్‌ను ఎంచుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ ప్రియురాలిగా ఆమె కనిపించబోతున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇటీవల అల్లు అర్జున్ ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. పుష్పరాజ్ పాత్రలో ఆయన కనిపించబోతున్నారు.













