మరో సినిమాను కన్ఫర్మ్ చేసిన రష్మిక
తెలుగుతో పాటు తమిళం, హిందీలో కూడా సినిమాలు చేస్తూ చేసిన ముద్దుగుమ్మ రష్మిక మందన్నా కెరీర్ ఈ మధ్య ఒక్కసారిగా స్లో అయింది. తమిళ్లో ఈమె నటించిన వారిసు రీసెంట్గా రిలీజ్ అయింది. హిందీలో ఈమె యానిమల్ సినిమాలో నటిస్తోంది. తెలుగులో పుష్ప2లో మాత్రమే నటిస్తోంది. కొన్ని సినిమాల డిస్కషన్స్ జరుగుతున్నా కన్ఫర్మ్ మాత్రం అవలేదు.
ఎట్టకేలకు రష్మిక ఇన్నాళ్లకు మరో సినిమాను కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. నితిన్ సరసన రష్మిక మరోసారి జత కట్టబోతుంది. వీరిద్దరి కాంబోలో గతంలో భీష్మ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే వెంకీ కుడుముల దర్శకత్వంలో నితన్ సినిమా ప్రారంభమయ్యే అవకాశముంది. నితిన్, రష్మిక, వెంకీ కుడుముల మరోసారి భీష్మ తర్వాత కలిసి పనిచేయబోతున్నారు. ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రానుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశాలున్నాయి.













