రిలీజ్ డేట్ విషయంలో ఆదర్శ కుటుంబంకు కొత్త చిక్కులు
ఆదర్శ కుటుంబం(Aadarsha kutumbam) సినిమాకు రిలీజ్ డేట్ మారడం మరో కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. వెంకటేష్(venkatesh)- త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్ కావడంతో మొదట్లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నప్పటికీ, రిలీజ్ కు ముందు ఆశించిన స్థాయిలో బజ్ కనిపించలేదు. అక్టోబర్ 9న దసరా కానుకగా రావాల్సిన సినిమా లాస్ట్ మినిట్ లో పోస్ట్‌పోన్ అవడంతో కీలకమైన హాలిడే సీజన్‌ను మిస్ చేసుకుంది. ప్రస్తుతం అక్టోబర్ 30 లేదా నవంబర్ 6 తేదీల్లో ఏదో ఒకదానిని పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో వెంకటేష్ సినిమాకు థియేటర్ల విషయంలో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని అంచనా. అయితే ఓవర్సీస్లో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. నవంబర్ 6న రామాయణ(ramayana) వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుండటంతో అప్పటికే చాలా స్క్రీన్లు ఆ సినిమాకు కేటాయించే అవకాశముంది. అంతేకాదు, నవంబర్ ఫస్ట్ వీక్ లో హాలీవుడ్ సినిమాల రిలీజులు కూడా ఉండటంతో ఆదర్శ కుటుంబంకు విదేశాల్లో సరైన స్క్రీన్ కౌంట్ దక్కడం సవాలుగా మారనుంది. ముఖ్యంగా నవంబర్ 6కు రిలీజ్ చేస్తే, పాజిటివ్ టాక్ వచ్చినా సినిమాకు అవసరమైన 3-4 వారాల థియేట్రికల్ రన్‌కు అడ్డంకులు ఏర్పడే అవకాశముంది.
ఇవి కూడా చదవండి
ఈ నేపథ్యంలో కొత్త రిలీజ్ డేట్‌తో పాటు సినిమాపై బజ్ పెంచడం మేకర్స్‌కు అసలు పరీక్షగా మారింది. ట్రైలర్, మిగిలిన సాంగ్స్ ఆడియన్స్ లో ఆసక్తి పెంచేలా ఉండటం ఇప్పుడు కీలకం. దసరా సీజన్‌ను కోల్పోవడంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా థియేట్రికల్ రైట్స్ విషయంలో భారీ మొత్తాలకు ముందుకు రావడానికి ఆలోచించే అవకాశం ఉంది. నవంబర్‌లో ఇప్పటికే షెడ్యూల్ అయిన చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలపై కూడా కొత్త రిలీజ్ డేట్ ఎఫెక్ట్ పడొచ్చు. అయితే త్రివిక్రమ్‌కు ఉన్న క్రేజ్, వెంకటేష్‌తో కలిసిన ఈ క్రేజీ కాంబినేషన్‌ను తక్కువగా అంచనా వేయలేం. సినిమా కంటెంట్ వర్కౌట్ అయితే ఈ రిస్క్ మొత్తం లాభంగా మారే అవకాశముంది.








