రామ్ చరణ్- సుజీత్ కాంబోపై కొత్త బజ్.. నిజమైతే మామూలుగా ఉండదు!
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(ram charan) ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో తన కెరీర్‌ను మరింత విస్తరించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం సుకుమార్(sukumar) దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్న చరణ్(charan).. ఆ తర్వాత చేయబోయే సినిమాపై మాత్రం ఇంకా అఫీషియల్ క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన కాంబినేషన్ గురించి చర్చ మొదలైంది.
యంగ్ డైరెక్టర్ సుజీత్(Sujeeth)తో రామ్ చరణ్(Ram charan) సినిమా చేసే అవకాశముందన్నది తాజా టాక్. సాహో, ఓజీ వంటి సినిమాలతో తనదైన యాక్షన్ టేకింగ్, స్టైలిష్ మేకింగ్‌ను చూపిస్తున్న సుజీత్.. ప్రస్తుతం బ్లడీ రోమియో(Bloody romeo)తో పాటు ఇతర ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. అలాంటి డైరెక్టర్ కు చరణ్ లాంటి స్టార్ హీరో జతైతే ప్రాజెక్ట్‌పై అంచనాలు సహజంగానే భారీ స్థాయికి చేరుకుంటాయి.
అయితే చరణ్- సుజీత్ కాంబినేషన్‌పై ఇప్పటివరకు అఫీషియల్ గా క్లారిటీ ఏదీ రాలేదు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే సుజీత్ ప్రస్తుత కమిట్మెంట్లు పూర్తయ్యాకే పట్టాలెక్కే అవకాశం ఉంది.








