విజయ్ సరసన నయనతార
సర్కార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళస్టార్ హీరో విజయ్ ప్రస్తుతం తాజాగా తన 63వ చిత్రం చేసేందుకు సిద్దమవుతున్నారు. యువ దర్శకుడు అట్లీ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో విజయ్ సరసన కన్నడ బ్యూటీ రష్మీక నటించనుందని ఇటీవల టాక్ వచ్చింది. కానీ ఇపుడు అవన్నీ రూమర్స్ అంటూ తేలిపోయింది. ఇక ఈ చిత్రంలో లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్గా నటించనున్నారని చిత్ర నిర్మాణ సంస్థ ఎజిఎస్ ఎంటర్టైన్మెంట్ అధికారికంగా ప్రకటన చేసింది. ఎఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదల కానుంది.













