నయన్ పిల్లల పేర్లకు నెటిజన్లు ఫిదా
భారత చిత్ర పరిశ్రమలోనే తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో నయనతార ఒకరు. గతంలో పలుమార్లు ప్రేమలో విఫలమైన నయన్, ఆఖరికి తన ప్రేమికుడు, డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుంది. గతేడాది వీరిద్దరూ తల్లిదండ్రులు కూడా అయ్యారు. సరోగసీ ద్వారా ఇద్దరు మగ కవలలకు ఈ జంట ప్రాణం పోశారు.
ఇప్పటి వరకు వారి ఫోటోలేవీ బయటకు రాకుండా జాగ్రత్త పడిన ఈ యంగ్ కపుల్, రీసెంట్గా వారి పేర్లను మాత్రం బయటపెట్టారు. ఇద్దరి పిల్లల పేర్లు వెనుక తల్లిదండ్రుల పేర్లు వచ్చేలా చూసుకున్న ఆమె, తమిళంలో ఇంట్రెస్టింగ్ గా ఉండే పేర్లనే తమ పిల్లలకు పెట్టుకున్నారు. పిల్లల్లో ఒకరి పేరు ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్ కాగా, మరొకరి పేరు ఉలగ్ దైవేగ్ ఎన్ శివన్.
తమిళ భాషలో ఉయిర్ అంటే ప్రాణం అని అర్థం. ఉలగ్ అనే పదం ఉలగం అనే మాట నుంచి వచ్చింది. ఉలగం అంటే ప్రపంచమన అర్థం. అంటే తమ పిల్లల్లో ఒకరు తమ ప్రాణమైతే, ఇంకొకరు తమ ప్రపంచమని నయన్ జంట చెప్పకనే చెప్తుంది. సాధారణంగా ఇలాంటి పేర్లు చాలా అరుదుగా ఉంటాయి కాబట్టి, ఈ పేర్లను సెలెక్ట్ చేసి పెట్టిన నయన్ జంటకు నెటిజన్లు భలే పేర్లు పెట్టారంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే నయన్ సరోగసీ విషయంలో నిబంధనలు పాటించలేదని గతంలో విమర్శలొచ్చాయి. సరోగసీ విషయంలో ఏవో న్యాయ పరమైన చిక్కులు కూడా ఈ జంట ఎదుర్కొంటున్నట్లు వార్తలొచ్చాయి కానీ కొంత కాలానికి అవి సద్దుమణిగాయి. ప్రస్తుతం నయన్ తమిళ్లో నాలుగైదు సినిమాలు చేస్తుంది.













