దర్బార్ సెట్లో లేడీ సూపర్ స్టార్
చంద్రముఖి, కథానాయకుడు చిత్రాల్లో జంటగా నటించారు రజనీకాంత్, లేడీ సూపర్ స్టార్ నయనతార. ఇప్పుడు మచ్చటగా మూడోసారి జోడీ కట్టబోతున్నారు… దర్బార్ కోసం. మురుగుదాస్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఇటీవలే ఈ చిత్రం పట్టాలేక్కింది. ముంబయిలో రజనీకాంత్‌పై కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు దర్బార్ సెట్లో నయనతార కూడా అడుగుపెట్టింది. సోమవారం నుంచి నయన దర్బార్ టీమ్‌తో కలిసింది. ప్రస్తుతం రజనీ, నయనపై చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రంలో రజనీకాంత్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. కథానుసారం రాజకీయాలకు సంబంధించిన అంశాలూ తెరపై కనిపిస్తాయని తెలుస్తోంది. 2020 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.













