అమ్మవారిగా నయన్
విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ నవతరం తాలరకు స్ఫూర్తిగా నిలుస్తున్నది నయనతార. ఆమె కథానాయికగా భక్తి ప్రధాన కథాంశంతో తమిళంలో మూక్కుత్తి అమ్మన్ (ముక్కు పుడక ఉన్న అమ్మవారు అని అర్థం) పేరుతో ఓ చిత్రం రూపొందుతున్నది. ఆర్.జె.బాలాజీ, ఎన్.జె.శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో చేతిలో త్రిశూలం ధరించి తలపై కిరీటంతో ప్రశాంత వదనంతో నయనతార కనిపిస్తున్నది. ఆమె పాత్ర భిన్న పార్శ్వాలతో వైవిధ్యంగా ఉంటుందని చిత్ర బృందం చెబుతున్నారు. సమకాలీన అంశాలతో తెరకెక్కిస్తున్న పూర్తి స్థాయి భక్తిప్రధాన చిత్రమిదని సమాచారం.













