రోరీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన నాగ సుశీల
సీటీఎస్ స్టూడియోస్, ఎస్టీవీ ఎంటర్‌టైన్స్‌మెంట్స్ సంయుక్తంగా చరణ్ రోరి నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం రోరి. చిత్రం ఫస్ట్‌లుక్‌ను నిర్మాత నాగ సుశీల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ నేను ఇప్పటి వరకు చేసిన సాంగ్స్, సినిమాలు ఒక శైలిలో ఉంటాయి. ఇందులో ప్రత్యేకంగా ఉంటాయి అని చెప్పారు. నాగ సుశీల మాట్లాడుతూ ఈ పోస్టర్ చూసి సర్ప్రైజ్ అయ్యాను. నాన్నగారు చరణ్‌కు స్ఫూర్తి అన్నారు. ఆయన దీవెనలు ఉంటాయి. రోరీ చిత్రమే తన వాస్తవ జీవితమని చరణ్ పేర్కొన్నారు.













