మైత్రి మూవీ మేకర్స్ చిత్ర నిర్మాతలుతో ఇంటర్వ్యూ
88 సంవత్సరాల తెలుగు సినీ చరిత్ర లో విజయ సంస్థ, సురేష్ ప్రొడక్షన్స్, వైజయంతి మూవీస్ వంటి ఎన్నో నిర్మాణ సంస్థలు అగ్ర సంస్థలుగా పేరు తెచ్చుకోవడానికి ఎన్నో ఏళ్ళు పట్టింది. స్టార్స్ తో కేవలం మూడు సినిమాలను నిర్మించడం అవి బ్లాక్ బస్టర్స్ కావడంతో అగ్ర నిర్మాణసంస్థల సరసన స్తానం సంపాదించుకుంది మైత్రీ మూవీస్ సంస్థ, ఇప్పుడు తెలుగులో ఓ బ్రాండ్ సంపాదించుకుంది మైత్రి మూవీ మేకర్స్. తాజాగా యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సవ్యసాచి’. పాపులర్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్(సి.వి.ఎం) ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 2న సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలుతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు…
మీరు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటపుడు ముగ్గురు కథ వింటారా?
– ముగ్గురం వింటాం కానీ..ఎవరికి వారు విడివిడిగా వింటాం ఆ తరువాత సంయుక్తంగా నిర్ణయం తీసుకుంటాం. ఈ కథ వద్దు.. ఇంకోకటి చేయండి అనేది ఇప్పటిదాకా ఏ దర్శకుడితోనూ రాలేదు. ఇప్పటిదాకా మా దర్శకులు చెప్పిన మూడు కథలు బావున్నాయి.
దర్శకుడు చందు మొండేటి మీకు కథ ఎప్పుడు చెప్పాడు?
– ‘వానిషింగ్ సిండ్రోమ్’ ఆధారంగా తాను కథ తయారు చేసుకున్నాడు. మాకు గత ఏడాది అంటే లాస్ట్ సెప్టెంబర్‌లో చెప్పారు. ప్రేమమ్ సినిమా షూటింగ్ టైం లోనే ఈ కథతో హీరోగారు, చందుగారు ఎప్పటి నుంచో ట్రావెల్ అయ్యారు. నవంబర్ లో షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది.
వరుస సక్సెస్‌లున్నాయి. కంటిన్యూ గా ఇదే రిజల్ట్ ఉంటుందని భావిస్తున్నారా?
– దీనికి సమాధానం ఎవరు చెప్పలేరు. మేము తీసే సినిమాలను చూసి ఆదరించే ప్రేక్షక దేవుళ్ళే నిర్ణయిస్తారు. సినిమా రంగం పై మాకున్న అనుభవం తో డైరెక్టర్ చెప్పే కథ ఏ హీరోకు బాగుంటుందో… మేము కలిసి తీసుకునే నిర్ణయాలు సరైనవి అనే పూర్తి నమ్మకంతోనే ప్రాజెక్టులు చేస్తాం. సక్సెస్లు ప్లాప్ లు అనేవి మా చేతుల్లో వుండవు కదా? కానీ అన్ని సినిమాలు సక్సెస్ కావాలనే నిర్మిస్తాం.
చందుమొండేటి ఈ సబ్జెక్ట్ ఎప్పుడు చెప్పారు?
– నవంబర్‌లో షూటింగ్ మొదలుపెట్టాం. అంతకు రెండు నెలల ముందు చెప్పారు. అంటే లాస్ట్ సెప్టెంబర్‌లో చెప్పారు. ప్రేమమ్ సినిమా షూటింగ్ టైం లోనే ఈ కథతో హీరోగారు, చందుగారు ఎప్పటి నుంచో ట్రావెల్ అయ్యారు.
తొలి మూడు సినిమాలు టాప్ స్టార్స్ తో చేశారు. తర్వాత ఇప్పుడు సెకండ్ రేంజ్ హీరోలతో చేస్తున్నారు?
– ముందు టాప్ స్టార్స్ తోనే చేద్దామనుకున్నాం. తర్వాత మేం మార్కెట్‌ని అబ్జర్వ్ చేస్తుంటే మిడ్ రేంజ్ మూవీస్ కూడా చాలా బాగా ఆడుతున్నాయి. అందుకే అవి కూడా చేద్దామనుకున్నాం. ఈ తరహా మూవీస్ 2016లో అనుకున్నాం కానీ 2017లో ప్రాసెస్ స్టార్ట్ చేశాం. ఇప్పటికి కుదిరింది.
మీ ముగ్గురిలో ఎవరికైనా సినిమా నిర్మాణ అనుభవం ఇంతకు ముందు ఏమైనా ఉందా?
– అందరికీ ఇంతకు ముందు చూసిన అనుభవమే అండీ. రవికి కాస్త ఎక్కువ బెటర్. మేం అందరం విజయవాడ నుంచే. అక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పుడూ సినిమానే. విజయవాడలో అందరూ సేమ్ బ్యాచ్. పాతికేళ్లుగా ఫ్రెండ్‌షిప్ ఉంది. ఆ తరువాత ఓవర్ సీస్ బిజినెస్ స్టార్ట్ చేసాము.
మాధవన్‌గారిని మీరు అప్రోచ్ అయ్యారా?
– మేం కలిసి కథ చెప్పగానే ఆయనకు నచ్చి చేస్తానన్నారు. ఆయన నటించిన చాలా సినిమాలు డబ్బింగ్ అయి ఇక్కడ బాగా ఆడాయి. దాంతో ఆయనకు తెలుగులో ఓ సినిమా చేయాలని అనిపించింది. ఈ కథ నచ్చి చేశారు.
మాధవన్‌గారు ఈ రోల్‌కి ఏదైనా స్పెషల్ హోమ్ వర్క్ చేశారా?
– ఆయనకు అలాంటివేమీ అక్కర్లేదండీ. ఆయన ఆన్‌సెట్‌లో ఇంప్రూవైజ్ చేసేవారు.
ఇందులో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి?
– ఇందులో ఉన్న సిండ్రోమ్ మాకు ఇంట్రస్టింగ్ గా అనిపించింది. ఆ చెయ్యి వేరుగా బిహేవ్ చేయడం అనేది చాలా ఇంట్రస్టింగ్ విషయం. అంతేగానీ ఒన్లీ యాక్షన్ కాన్సెప్ట్ తో చూడకూడదు. దీన్లో కామెడీ ఉంది. డ్రామా ఉంది. ఫస్ట్ ఆఫ్ పూర్తిగా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది.
హీరో, దర్శకుల మాటలను బట్టి… మీ సంస్థ యాడ్ కావడం వల్లనే బడ్జెట్ భారీగా అయిందన్నట్టు అన్నారు… నిజమేనా?
– అలాంటిదేమీ లేదండీ. కంఫర్టబుల్‌గానే ఉన్నాం. కావాల్సినంతే ఖర్చుపెట్టాం.
ముందు స్పెషల్ సాంగ్‌కి తమన్నాను అనుకుని, తర్వాత డ్రాప్ అయినట్టున్నారు?
– అంటే ఎంత ఆలోచించినా, ఆ సాంగ్‌లో తమన్నాను పెడితే సైడ్ ట్రాక్ గా అవుతుంది కధనం లింక్ తెగిన ఫీల్ కలుగుతుంది అది అంతగా ఫిట్ కాదని దర్శకుడు చెప్పారు. దాంతో వెనక్కి తగ్గాం అంతే.
తమన్నా కాకుండా ఇంకెవరినైనా అనుకున్నారా?
– లేదండీ.
మైత్రీ మూవీస్ చాలా మందికి అడ్వాన్సులు ఇస్తుంటారని అనుకుంటున్నారు?
– అడ్వాన్సులు ఇచ్చిన మాట నిజమే కథలు ఓ కె అయినప్పుడే అవి సెట్ మీదకు వస్తాయి.
పవన్ కల్యాణ్‌గారికి, త్రివిక్రమ్‌గారికీ డబ్బులిచ్చారనీ?
– అవును ఇచ్చాము అదికూడా ఎప్పుడు కథ ఓ కె అయితే అప్పుడే ఉంటుంది.
పవన్‌గారు చేస్తారనే అనుకుంటున్నారా? ఆయన రాజకీయాలతో బిజీగా వున్నారు కదా ?
– చేస్తారండీ ఎప్పటికైనా చేస్తారనే నమ్మకం మాకు వుంది, చేస్తారనే ఆశిస్తున్నాం..
గతంలో మీరు అడ్వాన్సులు వెనక్కి తిరిగి తెచ్చుకున్నారని..?
– అవి పుకార్లు మాత్రమే మేము ఎవరి వద్దనుండి రిటర్న్ తీసుకోలేదు.
త్రివిక్రమ్‌గారితో సినిమా ఎందుకు ఆలస్యమవుతుంది?
– అలాంటిదేమీ లేదండీ. కథను తయారు చేస్తున్నారు.
హీరోని ఎవరినైనా అనుకున్నారా?
– ఆయన ఎవరిననుకుంటే వాళ్లేనండీ.
మీ సంస్థలో ఒకసారి పనిచేసిన వాళ్లు మళ్లీ మళ్లీ చేస్తున్నారు. స్పెషల్ రీజన్స్ ఉన్నాయా?
– మేం వాళ్లతో హ్యాపీ. వాళ్లు మాతో హ్యాపీ అంతే. చందుతోనూ మళ్ళి రానున్న సినిమాల్లో ఏదో ఒకటి మా సంస్థలోనే ఉంటుంది.
సాయిధరమ్‌తోనూ, ఆయన తమ్ముడితోనూ ఒకేసారి తీస్తున్నారు?
– సాయితో చాలా రోజులుగా అనుకుంటున్నాం. ఇప్పుడు సెట్ అయింది. వైష్ణవ్‌తో బుచ్చిబాబు అని రంగస్థలం రైటర్ చేస్తున్నారు. డిసెంబర్ లాస్ట్ వీక్‌లో ఉంటుంది. సుకుమార్‌గారితో ఎప్పటి నుంచో ఉంది.
ఇంకా 14 సినిమాలు పైప్‌లైన్‌లో ఉన్నట్టున్నాయి?
– లైన్ ఓ కె వాటిలో షూటింగ్లో ఉన్నవి ఎన్నండీ? ఈ సినిమా రేపు రిలీజ్ ఆ తరువాత అమర్ అక్బర్ అంథోనీ.. షూటింగ్ లో డియర్ కామ్రేడ్ ఆ తరువాత స్టార్ట్ అయితే చిత్రలహరి. ఎనీ టైమ్ రెండు, మూడు కన్నా ఎక్కువ సెట్స్ మీద వుండవు ఆ విధంగానే మేము ప్లాన్ చేస్తున్నాము.
మీలో ఎవరు ఎక్కువగా ప్రొడక్షన్ చూసుకుంటారు?
– రవిగారు మాత్రం ఎప్పుడూ ఇక్కడే ఉంటారు. మిగిలిన ఇద్దరం ఆరు నెలలు ఉంటాం. సీఈఓ చెర్రీగారు ఉండనే వున్నారు ఆపై మాకు వండర్‌ఫుల్ టీమ్ కూడా ఉంది.
ఓవర్సీస్‌లో మీరు ఒకప్పుడు బిగ్ ప్లేయర్స్ కదా అది వదిలేసినట్టేనా ?
– అక్కడేం చేయట్లేదండీ. ఇప్పుడు అక్కడ గ్రేట్ ఇండియా వాళ్లు.. మిగిలిన వాళ్లు చేస్తున్నారు. అక్కడ బిజినెస్ చేయాలంటే కనీసం రెండు మూడు వారాలు అక్కడే ఉండాలి. కానీ ఇక్కడ ఇన్ని సినిమాలు ప్లాన్ చేసుకుని అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేద్దామంటే కష్టమవుతోంది.
సినిమా పోస్ట్ పోన్ అయినప్పుడు అక్కినేని ఫ్యాన్స్ ఫీలయ్యారు?
– లేదుగా. ఆ గ్యాప్‌లో వాళ్ల సినిమానే ఇంకోటి వచ్చింది అందుకే రిలీజ్ డేట్ మారింది.
మీ సంస్థలో డిలే సెంటమెంట్ ఏమైనా ఉందేమో?
– అది యాదృచ్చికం శ్రీ మంతుడు, జనతా, రంగస్థలం ఈ మూడు కూడా అలాగే డేట్స్ పోస్ట్ ఫోన్ అయ్యాయి.
సుకుమార్‌గారి సినిమా ఎప్పుడుంటుంది?
– ఏప్రిల్, మేలో ఉంటుంది.
సవ్యసాచి, అమర్ అక్బర్ కాకుండా.. మిగిలినవన్నిటిలో దేవిశ్రీ ప్రసాద్ ఉన్నట్టున్నారుగా?
– ఆయన మా సంస్థలో చాలా మంచి హిట్స్ ఇస్తున్నారండీ.
నానితో నెక్స్ట్ ఏమైనా ఉంటుందా?
– ఉందండీ.
సంతోష్ శ్రీన్ వాస్ సినిమా ఎప్పటి నుంచి ఉంటుంది?
– నవంబర్ నుంచి ఉంటుంది. తెరిలో చిన్న పార్ట్ మాత్రమే ఉంటుంది. మిగిలింది అంతా తన సొంత కథే.
పవన్‌గారి కోసం సంతోష్ చేసిన స్క్రిప్ట్ నే రవితేజకోసం మార్చినట్టున్నారుగా?
– తెరి సబ్జెక్టు లో చేసిన మార్పులను ఆయన పర్మిషన్‌తో చేశామండీ.
డబ్బులు పెట్టడమేనా? లొకేషన్లకు కూడా వెళ్తారా?
– ఎప్పుడు ఎవరో ఒకరం లొకేషన్లలో ఉంటాం.
లో బడ్జెట్ మూవీస్ తీసే ఆలోచన ఉందా ?
– స్టార్స్ తో తీసాం ఇక పై తీస్తాము ఇప్పుడు సెకండ్ లెవల్ మూవీస్ తీసాము. మీరు అడిగినట్లు ఆ ప్లానింగ్ కూడా వుంది అందరూ ఫ్రెషర్లతో చేస్తున్నాం. రితీష్ అనే డైరెక్టర్ తో ఇంకో 10 రోజుల్లో షూటింగ్ ఉంటుంది. రూ.89లక్షల బడ్జెట్ అడిగాడు మేము కోటి రూపాయలు కేటాయించాము. ఇంకో 10 రోజుల్లో షూటింగ్ ఉంటుంది.
స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి, స్మాల్ సినిమాలు చేయడానికి ఏమైనా తేడా ఉందా?
– దేని బడ్జెట్ దానికి ఉంటుంది. స్టార్ల సినిమాల్లో ఐదారు రోజుల్లో మంచి హిట్‌లో రికవర్ అయితే, ఇందులో 10 రోజుల్లో అవుతుంది.
సవ్యసాచిని తమిళ్‌లో విడుదల చేస్తున్నారా?
– మాధవన్‌గారు అక్కడ పెద్ద హీరో కాబట్టి, అక్కడ తమిళ్‌లో విడుదల చేయకూడనుకున్నాము డైరెక్ట్ గా తెలుగు విడుదల చేస్తున్నాము.
నెక్స్ట్ ఇయర్ ఐదు సినిమాలున్నాయా?
– ఈ ఇయర్ షూటింగ్ స్టార్ట్ అయినవి కూడా నెక్స్ట్ ఇయర్‌కి వస్తుంటాయి. కంటిన్యూయగా రెండు సినిమాలు షూటింగ్ జరుగుతుంటాయి.
మీ సొంత స్టూడియో… వంటి వాటిని గురించి ఆలోచిస్తున్నారా?
– మేము పరిశ్రమలో ఇంకా యంగ్ ఏజ్ లో వున్నాము ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు లేవండీ.
మైత్రీకి ప్రొడక్షన్ వేల్యూస్‌లో ఓ బ్రాండ్ ఉందికదా మిగిలిన సంస్థలతో టై అప్ అవ్వడానికి కారణం ఏంటి?
– సురేష్ ప్రొడక్షన్స్, వైజయంతి, శ్రీ వెంకటేశ్వర లాంటి పెద్ద సంస్థలే సంయుక్తంగా సినిమాలు నిర్మిస్తున్నారు . మేము కూడా కలిసి చేద్దామని అనుకున్నాం.
ఎన్టీఆర్‌తో మరలా ఎప్పుడుంటుందండీ?
– రాజమౌళిగారి సినిమా అయ్యాక ఉంటుంది.
టీవీ రంగంలో రావడానికి అవకాశం ఉందా?
– ఇంకా లేదండీ. ప్రస్తుతం టి వి కూడా బిగ్ రేంజ్ లో బిజినెస్ వుంది గతంలో ఎప్పుడో అమేజాన్ వారు అడిగారు. దాని మీద కూడా మా వాళ్లు పనిచేస్తూ ఉన్నారు.