టాలీవుడ్‌కు టీ సిరీస్
ఆడియో కంపెనీగా సినిమా ప్రొడక్షన్లోకి ఎంటర్ అయిన టీ సిరీస్ మొదట్లో ఆడియో క్యాసెట్స్ ఇండస్ట్రీస్ ప్రై. లి పేరుతో బిజినెస్‌లోకి ఎంటరైంది. ఎక్కువగా హిందీ సినిమాలకు సంబంధించిన సౌండ్ ట్రాక్స్, పాప్ మ్యూజిక్‌కి పాపులరైన టీ సిరీస్ చాలా తక్కువ టైమ్‌లోనే అతి పెద్ద మ్యూజిక్ రికార్డ్ లేబుల్గా పేరు సాధించింది.
తర్వాత నెమ్మదిగా సినిమాల నిర్మాణంలోకి కూడా ఎంటరైంది టీ సిరీస్. 1989లోనే సినిమాలను నిర్మించడం మొదలుపెట్టింది. ఇతర భాషల్లో సినిమాలను హిందీ లోకి రీమేక్ చేస్తూ వస్తున్న టీ సిరీస్ ఇప్పుడు టాలీవుడ్లో కూడా తన సత్తా ఏంటో చూపాలనుకుంటోంది.
ఇప్పటికే ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన టీ సిరీస్ దీంతో పాటూ మరి కొందరు సౌత్ హీరోలతో కూడా కలిసి పనిచేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా టీ సిరీస్ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీని కోసం టీ సిరీస్ హైదరాబాద్‌లో ఆఫీస్ ఏర్పాటు చేయాలనుకుంటుందట.
ఇప్పటికే హైదరాబాద్‌లో 400 చ.గజాల స్థలాన్ని టీ సిరాస్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్లేస్ లో ముంబై ఆఫీస్ ను పోలి ఉండే 7 అంతస్తుల బిల్డింగ్‌ను నిర్మించేందుకు టీ సిరీస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని బిల్డింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేసి ఇక్కడ కూడా బ్రాంచ్ ఆఫీస్ ను ఏర్పాటు చేయాలని చూస్తోందట టీ సిరీస్.













