మిస్టర్ కిల్లర్ టీజర్ విడుదల చేసిన అల్లరి నరేష్
సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న చిత్రం మిస్లర్ కిల్లర్. విశ్వ, కృష్ణ కురుప్, బ్రహ్మానందం, గిరిధర్, నరేస్ ప్రధాన పాత్రధారులు. చార్లెస్ దర్శకుడు. ఈ చిత్రం చిత్రీకరణ మొత్తం కాశ్మీర్‌లోనే జరిపారు. ఈ సినిమా టీజర్‌ను కామెడీ చిత్రాల హీరో అల్లరి నరేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ మిస్టర్ కిల్లర్ తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందిన సినిమా. చార్లెస్ దర్శకత్వంలో రమేష్ నిర్మించారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఇదే నెలలో విడుదల చేస్తామని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : బాలమురుగన్, సంగీతం: వేద్ శంకర్, నిర్మాతలు: రమేష్‌బాబు, ధూళిపాళ, శ్రీకృష్ణ శ్రవణ్ తమ్మలపల్లి, కథ, దర్శకత్వం : చార్లెస్.













