రవితేజ వారసురాలిగా మోక్షధా.. టాలీవుడ్లో పెరుగుతున్న డిస్కషన్!
మాస్ మహారాజా రవితేజ(raviteja) రీసెంట్గా ఇరుముడి(irumudi)తో భారీ సక్సెస్ ను అందుకుని మళ్లీ వార్తల్లో నిలిచారు. ఈ జోష్‌లోనే ఆయన మరో కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. వివేక్ ఆత్రేయ(Vivek athreya) దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు తులాభారం(Thulabaram) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ప్రియాంక మోహన్(priyanka mohan), జేడీ చక్రవర్తి(JD Chakravarthy), తరుణ్ భాస్కర్(Tharun Bhasker), అనస్వర రాజన్(anaswara rajan) కీలక పాత్రల్లో నటించనున్నారు. ఘనంగా జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం రవితేజ కూతురు మోక్షధా(mokshadha) నే.
తండ్రి సినిమాల విషయంలో మోక్షధా కేవలం ఫ్యామిలీ మెంబర్ గా మాత్రమే కాకుండా, నిర్మాణ వ్యవహారాల్లోనూ తనదైన పాత్ర పోషిస్తున్నారు. మాస్ జాతర(mass jathara) సినిమాతో ప్రొడక్షన్‌కు సంబంధించిన అంశాలపై అవగాహన పెంచుకున్న ఆమె, ఇరుముడి సినిమాకు నిర్మాణ బాధ్యతలను నిర్వహించారు. అంతేకాదు, కథల ఎంపిక, క్రియేటివ్ విభాగాలకు సంబంధించిన పనుల్లోనూ భాగస్వామ్యం అవుతున్నారు. తండ్రి సినిమాల వెనుక జరిగే కీలక వ్యవహారాలను దగ్గరగా పరిశీలిస్తూ ఇండస్ట్రీలో తన పరిచయాలను పెంచుకుంటున్నారు.
మరోవైపు నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలపై కూడా మోక్షధా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరుముడి సినిమా లాభాలకు సంబంధించిన అంశాలను స్వయంగా పర్యవేక్షించడం ఆమె బాధ్యతల పరిధి పెరుగుతోందనే సంకేతాలిస్తోంది. ప్రస్తుతం తులాభారం ముహూర్తం ఈవెంట్ లో ఆమె చురుగ్గా వ్యవహరించిన తీరు కూడా అదే విధంగా చర్చనీయాంశమైంది. రవితేజ వారసురాలిగా స్క్రీన్ పైకి రావడం కంటే, సినిమా నిర్మాణం నుంచి క్రియేటివ్ డెసిషన్స్ వరకు ఎక్స్‌పీరియెన్స్ సంపాదించడంపైనే మోక్షధా దృష్టి పెట్టడం ఆసక్తికరంగా మారింది.








