మోహన్ బాబు ఇంట్లో విషాదం
ప్రముఖ సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. మోహన్‌బాబు మాతృమూర్తి మంచు లక్ష్మమ్మ(85) కన్నుమూశారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మమ్మ ఈ రోజు కన్నుమూశారు. మంచు లక్ష్మమ్మ పార్థివదేహాన్ని తిరుపతి నుంచి ఎం.రంగంపేట సమీపంలో గల మోహన్ బాబు విద్యాసంస్థలు విద్యానికేతన్ ప్రాంగంణంలోని ఆమె నివాసానికి తరలించారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మోహన్‌బాబు, ఆయన కుటుంబ సభ్యులందరూ ఈ విషయం తెలియగానే స్వదేశానికి బయలుదేరారు. రేపు మంచు లక్ష్మమ్మ అంతక్రియలు తిరుపతిలో జరుగనున్నాయి. లక్ష్మమ్మ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.













