‘బ్యాక్ టూ వర్క్ అండ్ బ్యాక్ ఇన్ యాక్షన్’ : మెగాస్టార్ ఇంస్టాగ్రామ్ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి కరోనా నుంచి కోలుకున్నారు. గత కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన హోం క్వారంటైన్లో చికిత్స అనంతరం కోలుకున్నారు. తాజాగా కోవిడ్ నెగిటివ్ రావడంతో మళ్లీ తిరిగి షూటింగులకు హాజరయ్యారు. లూసిఫర్ రీమేక్ గా వస్తున్న ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వివరించారు. ‘బ్యాక్ టూ వర్క్ అండ్ బ్యాక్ ఇన్ యాక్షన్’ అంటూ సినిమా సెట్స్‌లో పాల్గొన్న ఫోటోలకు షేర్ చేశారు. ఇక తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు.













