ఒకేసారి మూడు సినిమాలతో రీఎంట్రీకి సిద్ధమైన మెగా హీరో
మెగా హీరో వైష్ణవ్ తేజ్(vaishnav tej) కెరీర్లో ఇప్పుడు కీలకమైన దశ నడుస్తోంది. మొదటి సినిమా ఉప్పెన(uppena)తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో, ఆ తర్వాత ఆశించిన స్థాయిలో సక్సెస్‌లను అందుకోలేకపోయాడు. కొండపొలం(konda polam), రంగ రంగ వైభవంగా(ranga ranga vaibhavanga), ఆదికేశవ(Adhikeshava) వంటి సినిమాలు నిరాశపరచడంతో కొంతకాలంగా కొత్త సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఈ మూడేళ్ల గ్యాప్‌లో వచ్చిన పలు కథలను పరిశీలించినప్పటికీ, ఆయన తనకు నచ్చిన ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మాత్రం వరుస సినిమాలతో తిరిగి బిజీ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు.
వైష్ణవ్ తేజ్ నెక్ట్స్ సినిమాకు మహేష్(mahesh) దర్శకత్వం వహించనున్నారు. గతంలో సుధీర్ బాబు(Sudheer babu) హీరోగా వచ్చిన ది హంట్(the hunt) సినిమాను తెరకెక్కించిన మహేష్, ఈసారి మెగా హీరోతో కొత్త కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అనిల్ సుంకర(anil sunkara) నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించిన ఇతర వివరాలపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
మరోవైపు, డైరెక్టర్ వీఐ ఆనంద్(VI Anand)తో సినిమా కోసం డిస్కషన్ ఆఖరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు శ్రీనివాస్ చిట్టూరి(srinivas chitturi) నిర్మాతగా వ్యవహరించే అవకాశముంది. అలాగే గీత గోవిందం(Geetha govindam) ఫేమ్ పరశురామ్(parasuram) దర్శకత్వంలోనూ వైష్ణవ్ తేజ్ ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. పరశురామ్ చెప్పిన లైన్ కు వైష్ణవ్ ఓకే చెప్పడంతో ఆయన స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాను దిల్ రాజు(Dil raju) నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(SVC) నిర్మించనుంది. ఈ మూడు సినిమాలు కార్యరూపం దాల్చితే వైష్ణవ్ తేజ్ కెరీర్‌కు కొత్త ఊపు రావడంతో పాటు, ఆయన తదుపరి ప్రయాణంపై ఆసక్తి పెరగనుంది.








