Meenakshi Chaudhary: ఇకపై అలాంటి పాత్రలకు నో అంటున్న మీనాక్షి
మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary)కి గుంటూరు కారం(Guntur karam), గోట్(GOAT) సినిమాలు కెరీర్ పరంగా ఎంతో ఉపయోగ పడినప్పటికీ లక్కీ భాస్కర్(Lucky Baskhar) లాంటి హిట్ సినిమాలో హీరోయిన్ గా నటించడం తన మార్కెట్ ను బాగా పెంచింది. ఆ పాత్రే ఇప్పుడు తనను భయపెడుతుందని మీనాక్షి చెప్తుంది. లక్కీ భాస్కర్ లో పిల్లాడి తల్లిగా నటించడంపై తన సన్నిహితులు భయపెట్టారని మీనాక్షి తెలిపింది.
ఇంత తక్కువ వయసులో ఇలాంటి పాత్రలు చేస్తే రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పాత్రలే వస్తాయని చెప్పారని, అందుకే ఇకపై అలాంటి పాత్రలున్న సినిమా కథ ఎంత నచ్చినా సరే నో చెప్పేస్తానని మీనాక్షి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అయితే ఇది కొంతవరకు నిజమే అయినప్పటికీ మీనాక్షి దాన్ని మరీ అంత గుడ్డిగా ఫాలో అయిపోవాల్సిన పన్లేదు.
ఇండస్ట్రీలో అలాంటి పాత్రలు చేసి పైకొచ్చిన వాళ్లు చాలా మందే ఉన్నారు. మహానటి(Mahanati) పాత్రలో కీర్తి సురేష్(Keerthy Suresh) ఏకంగా చనిపోయే క్యారెక్టరే చేసింది. ఆ సినిమా తర్వాతే తనకు మహేష్(Mahesh), విక్రమ్(Vikram), వరుణ్ ధావన్(Varun Dhawan) తో కలిసి నటించే ఛాన్సొచ్చింది. కాబట్టి మీనాక్షి భయంలో న్యాయమున్నప్పటికీ ఈ టైమ్ లో కొంత ప్రాక్టికల్ గా ఆలోచించి మంచి కథలొస్తే ఆ సినిమాలను వదులుకోకుండా ఉండటమే బెటర్.













