‘మాయం’ ట్రైలర్ ను విడుదల చేసిన పూరి
అజయ్ కతువార్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం మాయం. ఇషితా షా కథానాయిక. జయశ్రీ రాచకొండ, లక్ష్మి హుసేన్, సందీప్ బోరెడ్డి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నిషాంత్ దర్శకత్వం వహిస్తుండగా, డి.ఎ.రాజు నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ నేను దర్శకత్వం వహించిన మోహబూబా తో నటుడిగా కెరీర్‌ని ప్రారంభించాడు అజయ్. మాయం ని దర్శకుడు ఎంతో తపనతో తెరకెక్కిస్తున్నార న్నారు. కథానాయకుడు మాట్లాడుతూ హాలీవుడ్ లో నటించిన అనుభవం ఉంది. తెలుగులో పూరి సార్ ప్రోత్సాహంతో మోహబూబా లో నటించా. మాయం తో పాటు ప్రేమదేశం చిత్రాలు విడులకి సిద్ధమవుతున్నాయ న్నారు. ఇదొక విభిన్నమైన చిత్రం. ఇందులో ఎవరు, దేన్ని మాయం చేశారన్నది అసక్తికరం అన్నారు దర్శకుడు.













