రానా, మిహికాల పెళ్లి తేదీ ఖరారైంది?
దగ్గుబాటి రానా ఓ ఇంటివాడౌతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌కి చెందిన బంటి బజాజ్, సురేష్ బజాజ్ దంపతుల కుమార్తె మిహికా బజాజ్, రానా కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఆమధ్య మిహికాను తన గర్ల్ ఫ్రెండ్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం చేశాడు రానా. వీరిద్దరి ప్రేమను పెద్లలు కూడా అంగీకరించడంతో త్వరలోనే పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం అమలవుతున్న లాక్డౌన్ కారణంగా పెళ్లికి సరైన తేదీని నిర్ణయించలేకపోతున్నారు. ఇటీవల ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో రోకా వేడుకను నిర్వహించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ కారణంగా ఆట్టహాసంగా ఈ వేడుకను నిర్వహించే అవకాశం లేకపోవడంతో ఎంతో నిరాడంబరంగా జరిపారు.
ఈ వేడుక తర్వాత డిసెంబర్ వివాహం జరిగే అవకాశం ఉందని తెలిసింది. రానా తండ్రి మాత్రం డిసెంబర్ కావచ్చు, అంతకంటే ముందే జరగొచ్చు అన్నారు. ఆయన అన్నట్టుగానే ఆగస్ట్ 8న రానా, మిహికాల వివాహానికి ముహూర్తం నిర్ణయించారని సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇరు కుటుంబాల వారు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మిహికా చెల్సియా వర్శిటీ నుంచి ఇంటీరియర్ డిజైనింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందింది. డ్యూ డ్రాప్ డిజైన్ పేరుతో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ రన్ చేస్తోంది మిహికా.













