త్వరలో మంచు కురిసె వేళలో ఫస్ట్ లుక్ విడుదల
రామ్ కార్తీక్, ప్రనాలి జంటగా నటిస్తున్న చిత్రం మంచు కురిసె వేళలో. ప్రణతి ప్రొడక్షన్ పతాకంపై బాల బోడెపూడి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుదిదశలో ఉన్నాయి. దర్శకనిర్మాత బాల మాట్లాడుతూ టైటిల్ తగ్గట్టే స్వచ్ఛమైన ప్రేమకథతో రూపొందిన చిత్రమిది. చక్కని వినోదాన్ని పంచుతుంది. వైజాగ్, అరకు, కూర్గ్, ఊటీ, హైదరాబాద్‌లోని సుందరమైన లోకేషన్లలో షూటింగ్ చేశాం. మళ్లీ రావా ఫేం శ్రావణ్ భరద్వాజ్ సంగీతం సినిమాకు ఎసెట్‌గా నిలుస్తుది. త్వరలో ఫస్ట్‌లుక్‌ను ఆవిష్కరించి, డిసెంబర్లో సినిమాను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు.













