తాను మలేషియా బ్రాండ్ అంబాసిడర్‌ను కాను
తాను మలేషియా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం లేదని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సృష్టం చేశారు. మలేషియా ప్రధాని నజీబ్ రజాక్‌తో సమావేశమనంతరం రజనీ మీడియాతో మాట్లాడారు. మలేషియా ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని తనను సంప్రదించినట్లు వచ్చిన వార్తలను రజనీ తోసిపుచ్చారు. మలేషియాలో మరిన్ని సినిమాల షూటింగ్‌లు చేయాలని ప్రధాని రజాక్ తనను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. ఇది నిజంగా చక్కని సమావేశమని రజనీ అభిప్రాయపడ్డారు. ఆరు రోజుల పర్యటలో భాగంగా భారత్ చేరుకున్న మలేషియా ప్రధాని నజీబ్ రజాక్, చెన్నైలోని రజనీ నివాసానికి వెళ్లి ఆయనను కలుసుకున్న విషయం తెలిసిందే.













