SSMB29: ఇంత సీక్రెట్‌గా దేనికి జక్కన్నా?
సోషల్ మీడియా పాపులరైన కాలంలో ఎంత పెద్ద సినిమాల నుంచైనా లీకులందుతున్నాయి. కానీ రాజమౌళి(Rajamouli) మాత్రం తన సినిమాల నుంచి ఎలాంటి లీక్స్ జరగకుండా ఎంతో జాగ్రత్తపడతాడు. సినిమా మొదలైన దగ్గర్నుంచి గుమ్మడికాయ కొట్టేవరకు అన్ని విషయాల్లో జక్కన్న, తన టీమ్ ఎన్నో జాగ్రత్తలు వ్యవహరిస్తారు.
అయితే ఇప్పుడు మరీ విడ్డూరంగా రాజమౌళి తన సినిమా షూటింగే కాకుండా, ముహూర్త వేడుకకు సంబంధించిన విశేషాలు కూడా బయటికి రాకుండా చేస్తున్నాడు. SSMB29 సినిమాకు సంబంధించిన ముహూర్త వేడుక నిన్న హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగింది. ఎలాంటి హడావిడి లేకుండా ఈ వేడుకను చాలా సింపుల్ గా కానిచ్చేశారు.
కనీసం మీడియాకు కూడా అనుమతి లేదు. ఎప్పుడూ తన సినిమాల ముహూర్త కార్యక్రమానికి మహేష్(Mahesh Babu) కూడా ఇందులో పాల్గొన్నాడు. అయితే ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ మీడియాకు జక్కన్న(Jakkanna) టీమ్ రిలీజ్ చేయలేదు. ఎలాగూ సినిమాకు సంబంధించిన లీకులు రావు కాబట్టి ఇవైనా బయటకు వస్తే సంబరపడతాం కదా అని మహేష్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కొంచెం లేటైనా ముహూర్త కార్యక్రమానికి సంబంధించిన విశేషాలు, ఫోటోలను జక్కన్న నెట్టింట షేర్ చేస్తాడని అందరూ ఆశ పడుతున్నారు.













