రాజమౌళి కంటే ముందు మరో సినిమా?
ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న మహేష్ బాబు, తన తర్వాతి సినిమాను దర్శకధీరుడు రాజమౌళితో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను ఇంకా లాక్ చేయకపోవడంతో టీమ్‌తో కలిసి దీనిపై వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్టోరీని ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ లా రెడీ చేయడానికి ఎంత లేదన్నా మరో ఆరు నెలల టైమ్ పడుతుందని ఇన్సైడ్ టాక్.
మహేష్ డిసెంబర్ తో గుంటూరు కారం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఫ్రీ అవుతాడు. ప్రమోషన్స్ కోసం మరో నెల కేటాయించినా సంక్రాంతి తర్వాత నుంచి మహేష్ ఖాళీనే. రాజమౌళి సినిమా మొదలవడానికి ఆగస్ట్ వరకు టైమ్ పట్టే ఛాన్సుంది. దీంతో ఈ లోపు మరో సినిమా చేయాలని మహేష్ సీరియస్ గా ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి తో మరో సినిమా చేసే ఛాన్సుందని వార్తలొస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు టైమ్‌లోనే వీరి కాంబోలో మరో సినిమా చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నట్లు అటు అనిల్, ఇటు మహేష్ ఇద్దరూ చెప్పుకొచ్చారు. డేట్స్ వరుసగా ఇస్తే ఆరు నెలల్లో అనిల్ సినిమా పూర్తి చేసి చేతిలో పెట్టగలడు. అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చే వరకు చెప్పలేం కానీ ఇది జరిగే అవకాశాలు లేకపోలేదు.













