గుంటూరు కారం లో ఈ మార్పులు అవసరమా???
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా గుంటూరుకారం. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రోజుకో ట్విస్ట్ బయటకి వస్తుంది. నిన్నటికి నిన్న ఛాయాగ్రహణం నుండి పీఎస్ వినోద్ తప్పుకొన్నారని వార్త వచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఇదిలా ఉంటే గుంటూరు కారం మ్యూజిక్ డైరెక్టర్ గా త్రివిక్రమ్.. ఎస్ ఎస్ థమన్ ని ఫిక్స్ చేయగా, ఈ సినిమాకి థమన్ అందించిన కొన్ని ట్యూన్స్ మహేష్ కి నచ్చలేదట. అయినా త్రివిక్రమ్ పైన నమ్మకం తో ఇప్పటివరకు నెట్టుకుంటూ వచ్చారట.
కానీ ఇప్పుడు ఎక్కువ టైమ్ లేదు కాబట్టి థమన్ స్థానం లో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లని పెట్టే విధంగా మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా నాలుగు సాంగ్స్ హేశం అబ్దుల్ వహాబ్, మరో రెండు మాస్ సాంగ్స్ భీమ్స్ సిసిరిలియోకి ఇవ్వాల్సిందిగా మహేష్ ని కోరారట. కాగా హీరో మహేష్ ఈ గ్యాప్లో తన ఫ్యామిలీ తో వెకేషన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. విదేశాల్లో ఉన్న మహేష్ తన అభిప్రాయాన్ని ఫోన్ ద్వారా డిసైడ్ చేస్తారంట.
మరో వైపు మూవీ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ కూడా నిరాశ చెందుతున్నారు. అఫీషియల్ కన్ఫర్మేషన్ లేనప్పటికీ ఇప్పటికే చిత్ర యూనిట్లో జరిగిన మార్పుల వల్ల ఈ విషయం కూడా నిజమే అని నమ్మాలి. ఒకవేళ నిజమైనా మంచిదే అనుకోవాలి. ఇప్పటికే ఈ సినిమాలో చాలా మార్పులు జరుగుతున్నాయి. అయినా కానీ చిత్ర నిర్మాత నాగవంశీ మాత్రం ఈ విషయాల్లో మౌనం వహిస్తూనే ఉన్నారు. ఆగస్టు 9 న మహేష్ బర్త్ డే కారణంగా ఏదైనా అప్ డేట్ ఉంటే, దానితో అయినా అందరి డౌట్లకు ఫుల్స్టాప్ పడుతుందేమో చూడాలి.













