సుక్కుకు మహేష్ గ్రీన్ సిగ్నల్
సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం మహర్షి చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటించేందుకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రంగస్థలం తర్వాత మహేష్, సుకుమార్ కాంబినేషన్ ఫైనల్య్యింది. కానీ కథ విషయం ఇంకా ఫైనాల్ కాలేదని అంటు వస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం మహేష్‌కు సుకుమార్ మరో కొత్త లైన్ విన్పించారని తెలిసింది. ఇదొ క్రైమ్, థ్రిల్లర్ స్టోరీ అని, మహేష్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉందని దీంతో ఆయన ఒకే చెప్పారని తెలిసింది. ప్రస్తుతం మహర్షి చిత్రం జనవరికల్లా పూర్తికానుంది. ఆ లోపు పుల్స్క్రిప్టు రెడీ చేస్తానని సుకుమార్ చెప్పారని తెలిసింది.













