హాలీవుడ్ లో మహారాజా.. విజయ్ సేతుపతికి అరుదైన గుర్తింపు
విజయ్ సేతుపతి(vijay sethupati) కెరీర్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహారాజా(maharaja) ఇప్పుడు మరో కీలక మైలురాయికి చేరుకుంది. నిథిలన్ స్వామినాథన్(Nithilan swaminathan) తెరకెక్కించిన ఈ తమిళ థ్రిల్లర్‌పై హాలీవుడ్ ఆసక్తి చూపిస్తోంది. సినిమాను ఇంగ్లీష్‌లో రీమేక్ చేసేందుకు ఓ హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఇప్పటికే మేకర్స్‌ను సంప్రదించినట్లు నిర్మాత సుధన్ సుందరం(Sudhan sundaram) వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను హాలీవుడ్ స్థాయిలో రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీంతో భారతీయ భాషల్లో సక్సెస్ఫుల్ కథలు ఇంటర్నేషనల్ లెవెల్ లోకి వెళ్తున్న లిస్ట్ లో మహారాజా కూడా చేరింది.
ముఖ్యంగా ఈ రీమేక్‌కు హీరోగా ఓ ఏ-లిస్టెడ్ హాలీవుడ్ నటుడిని తీసుకోవాలనే ఆలోచనలో నిర్మాణ సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మహారాజాలో విజయ్ సేతుపతి పోషించిన క్యారెక్టర్ కు మాథ్యూ మెక్కనహే పేరును పరిశీలిస్తున్నారనే ప్రచారం మొదలైంది. అయితే ఆయన ఎంపిక ఇంకా ఖరారు కాలేదు. మెక్కనహే పేరును నటుల్లో ఒకరిగా చర్చిస్తున్నట్టు నిర్మాత స్వయంగా ప్రస్తావించడం ఆసక్తిని పెంచుతోంది. కథలోని ట్విస్టులు, నాన్- లీనియర్ నెరేషన్, పాత్రల మధ్య సంబంధాలను హాలీవుడ్ ఆడియన్స్ కు అనుగుణంగా ఎలా మలుస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి
మహారాజా విజయ్ సేతుపతి 50వ సినిమాగా రిలీజై బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా ఇతర మార్కెట్లలోనూ తన ప్రభావాన్ని చూపించింది. ముఖ్యంగా చైనాలో సినిమాకు వచ్చిన రెస్పాన్స్.. తర్వాత ఓటీటీలో ఏర్పడిన ఆసక్తి అంతర్జాతీయ రీమేక్ అవకాశాలకు కారణమైనట్లు నిర్మాత వెల్లడించారు. సాధారణ కథనానికి భిన్నంగా సాగే స్క్రీన్‌ప్లే, చివరి వరకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ ను నిలబెట్టే విధానం ఈ సినిమాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ఇప్పుడు అదే కథ హాలీవుడ్ వెర్షన్‌గా మారితే, అక్కడి ఆడియన్స్ కోసం ఎలాంటి మార్పులు చేస్తారనేది ఈ ప్రాజెక్ట్‌లో మెయిన్ ఎట్రాక్షన్ గా నిలవనుంది.








